వేటు తప్పదు! | enquery on Embezzlement surpanch's | Sakshi
Sakshi News home page

వేటు తప్పదు!

Jun 7 2016 1:50 AM | Updated on Mar 28 2018 11:26 AM

వేటు తప్పదు! - Sakshi

వేటు తప్పదు!

నిధుల దుర్వినియోగం, నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్‌లపై వేటుకు రంగం సిద్ధమైంది.

నిధుల దుర్వినియోగంపై సీరియస్
‘లే అవుట్ల’ అనుమతులపై విచారణ
గతంలోనే సంజాయిషీ నోటీసులు
సంతృప్తికరంగాలేని సమాధానాలు
మొత్తం 46 పంచాయతీలపై ఆరా
ఏడుగురిపై కొలిక్కి వచ్చిన విచారణ
లోతుగా ఆరాతీసిన యంత్రాంగం
స్వయంగా రంగంలోకి ‘డీపీఓ’
త్వరలో కలెక్టర్ వద్దకు తుది నివేదిక   

ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌ల ప్రాతినిథ్య గ్రామాలు మునుగనూరు (హయత్‌నగర్), మల్కీజిగూడ (యాచారం), బొమ్మరాసిపేట (శామీర్‌పేట్), మణికొండ (రాజేంద్రనగర్), కిస్మత్‌పూర్ (రాజేంద్రనగర్), బాటసింగారం  (హయత్‌నగర్), తుర్కయంజాల్ (హయత్‌నగర్)

సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిధుల దుర్వినియోగం, నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్‌లపై వేటుకు రంగం సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిన సర్పంచ్‌లకు సంజాయిషీ నోటీసులు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. సంతృప్తికరమైన సమాధానాలివ్వని వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు తుది హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు, అనధికారికంగా లేఅవుట్లకు అనుమతులు  ఇస్తున్నట్లు గుర్తించింది. ఇలా పలు అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించి నట్లు వెల్లువెత్తిన ఫిర్యాదులను విచారించిన పంచాయతీరాజ్‌శాఖ..

వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిం చింది. జిల్లాలో 46 గ్రామ పంచాయతీలపై ఇలాంటి ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్‌లను వివరణ కోరు తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అక్రమాలకు వత్తాసు పలికిన ఉద్యోగులపై యంత్రాంగం వి చారణకు ఆదేశించింది. మరోవైపు పలువురు సర్పంచులు వివరణ ఇచ్చినప్పటికీ వాటికి సంతృప్తి చెందని పంచాయతీశాఖ.. ప్రత్యేకంగా విస్తరణ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికాారులను విచారణ అధికారులుగా నియమించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తోంది.

‘నిధుల గోల్‌మాల్’
ఫిర్యాదులు వచ్చిన పలు పంచాయతీల్లో నిధుల దుర్వినియోగమే ప్రధానాంశమని గుర్తించిన అధికారులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విస్తరణ అధికారులు, డివిజినల్ పంచాయతీ అధికారులతోపాటు కొన్ని పంచాయతీల్లో ఏకంగా డీపీఓ విచారణ చేపట్టారు. 46 పంచాయతీలకు సంబంధించి విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందులో ఏడు పంచాయతీలకు సంబంధించి తుది నివేదికలు సైతం అతిత్వరలో జిల్లా కలెక్టర్‌కు సమర్పించేందుకు పంచాయతీ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే మహేశ్వరం మండలం తుమ్మలురు గ్రామ పంచాయతీ సర్పంచును తొలగించగా.. మేడ్చల్ మండలం ఎల్లంపేట మాజీ సర్పంచ్‌కు రికవరీ నోటీసులు అందించింది. రాజేంద్రనగర్ మండలం పుపాల్పగూడ మాజీ సర్పంచ్‌పై ఏకంగా క్రిమినల్ కేసు సైతం నమోదైంది.

 ఆ పంచాయతీలు ఇవే..
తాజాగా ఏడుగురు సర్పంచులపై జిల్లా పంచాయతీ శాఖ చర్యలు తీసుకునేం దుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి తుది విచారణ నివేదికలు కలెక్టర్‌కు సమర్పించనుంది. వీటిలో ము నుగనూరు (హయత్‌నగర్), మల్కీగూ డ (యాచారం), బొమ్మరాసిపేట (శామీర్‌పేట్), మణికొండ (రాజేంద్రనగర్), కిస్మత్‌పూర్ (రాజేంద్రనగర్), బాటసిం గారం (హయత్‌నగర్), తుర్కయాంజా ల్ (హయత్‌నగర్) గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో బొమ్మరాసిపేట, మణికొండ, బాటసింగారం, తుర్కయా ంజాల గ్రామ పంచాయతీలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారే స్వయ ంగా విచారణ చేపట్టడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement