breaking news
Embezzlement
-
అక్రమాస్తులు రూ.50 కోట్లపైనే..
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జనపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. గురువారం ఏక కాలంలో ఆమె నివాసంతోపాటు బంధువులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మరో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదు కలిపి మొత్తం రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధుశర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అందిన సమాచారం మేరకు సుచరితపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సోదాల్లో పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నగదు, నగలు, స్థిరాస్తులు ఇలా...ఏసీబీ అధికారులు గురువారం నాటి సోదాల్లో సుచరితకు చెందిన పలు ఆస్తులను గుర్తించారు. వాటిలో సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు నివాస స్థలాలు, రూ.12 లక్షల నగదు, వోక్స్వ్యాగన్ కారు, హ్యుందాయ్ క్రెటాకారు, రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు పేర్కొ న్నారు. సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5,05, 52,465గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే లంచం కేసులో అరెస్టుశామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చాలంటూ కొందరు రైతులు దరఖాస్తు చేసుకు న్నారు. శామీర్‌పేట్ తహసీల్దార్ పనిచేసిన సమయంలో సుచరిత ఇందుకోసం ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు.రైతులు రిక్వెస్ట్ చేయడంతో వాయిదాల్లో డబ్బు ఇవ్వాలని దాని ప్రకారమే వ్యవసా యేతర భూమిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధిత రైతులు ఏసీబీని ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా మే 26న సుచరితను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసింది. ఈ కేసులో సుచరిత ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలులో జ్యుడీషి యల్ రిమాండ్‌లో ఉన్నారు. అక్రమార్జనపై సమాచారంతో ఏసీబీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. -
రూ.19.64 కోట్ల ఆస్తుల వేలం
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల అధిపతి నౌహీరా షేక్‌పై నమోదైన అక్రమార్జన కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్‌కు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఒక ఆస్తిని వేలం వేసి విక్రయించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ యూనిట్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేలం వేసిన ఆస్తుల రిజి్రస్టేషన్ కూడా శుక్రవారం పూర్తయిందని వెల్లడించింది. 2019 ఆగస్టు 16న తాత్కాలికంగా జప్తు చేసిన ఈ ఆస్తిని.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తులో భాగంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.నౌహీరా షేక్, ఆమె సహచరులు ఏటా 36 శాతం కంటే ఎక్కువ లాభం ఇస్తామని హామీ ఇచ్చి ప్రజల నుంచి మొత్తం రూ.5,978 కోట్లకుపైగా పెట్టుబడులు సేకరించారు. కానీ అసలు కూడా తిరిగి ఇవ్వకుండా లక్షలాది మంది పెట్టుబడిదారులను మోసం చేశారు. ఇలా కొల్లగొట్టిన డబ్బుతో నౌహీరా షేక్ తన పేరు, తన కంపెనీల పేరు, బంధువుల పేర్ల మీద భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు రూ.428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.ఈ కేసులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్, సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్లను హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మోసపూరితంగా నష్టపోయిన పెట్టుబడిదారులకు నష్టపరిహారం అందించేందుకు జప్తు చేసిన ఆస్తులను వేలం వేయడానికి ఈడీ న్యాయస్థానాన్ని అనుమతి కోరింది. సుప్రీం ఆమోదం తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభించింది. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నౌహీరా షేక్ , హీరా గ్రూప్ మోసంతో నష్టపోయిన పెట్టుబడిదారులకు పరిహారంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. -
వేటు తప్పదు!
♦ నిధుల దుర్వినియోగంపై సీరియస్ ♦ ‘లే అవుట్ల’ అనుమతులపై విచారణ ♦ గతంలోనే సంజాయిషీ నోటీసులు ♦ సంతృప్తికరంగాలేని సమాధానాలు ♦ మొత్తం 46 పంచాయతీలపై ఆరా ♦ ఏడుగురిపై కొలిక్కి వచ్చిన విచారణ ♦ లోతుగా ఆరాతీసిన యంత్రాంగం ♦ స్వయంగా రంగంలోకి ‘డీపీఓ’ ♦ త్వరలో కలెక్టర్ వద్దకు తుది నివేదిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ల ప్రాతినిథ్య గ్రామాలు మునుగనూరు (హయత్‌నగర్), మల్కీజిగూడ (యాచారం), బొమ్మరాసిపేట (శామీర్‌పేట్), మణికొండ (రాజేంద్రనగర్), కిస్మత్పూర్ (రాజేంద్రనగర్), బాటసింగారం (హయత్‌నగర్), తుర్కయంజాల్ (హయత్‌నగర్) సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిధుల దుర్వినియోగం, నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్‌లపై వేటుకు రంగం సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిన సర్పంచ్‌లకు సంజాయిషీ నోటీసులు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. సంతృప్తికరమైన సమాధానాలివ్వని వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు తుది హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు, అనధికారికంగా లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నట్లు గుర్తించింది. ఇలా పలు అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించి నట్లు వెల్లువెత్తిన ఫిర్యాదులను విచారించిన పంచాయతీరాజ్‌శాఖ.. వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిం చింది. జిల్లాలో 46 గ్రామ పంచాయతీలపై ఇలాంటి ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్‌లను వివరణ కోరు తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అక్రమాలకు వత్తాసు పలికిన ఉద్యోగులపై యంత్రాంగం వి చారణకు ఆదేశించింది. మరోవైపు పలువురు సర్పంచులు వివరణ ఇచ్చినప్పటికీ వాటికి సంతృప్తి చెందని పంచాయతీశాఖ.. ప్రత్యేకంగా విస్తరణ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికాారులను విచారణ అధికారులుగా నియమించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తోంది. ‘నిధుల గోల్మాల్’ ఫిర్యాదులు వచ్చిన పలు పంచాయతీల్లో నిధుల దుర్వినియోగమే ప్రధానాంశమని గుర్తించిన అధికారులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విస్తరణ అధికారులు, డివిజినల్ పంచాయతీ అధికారులతోపాటు కొన్ని పంచాయతీల్లో ఏకంగా డీపీఓ విచారణ చేపట్టారు. 46 పంచాయతీలకు సంబంధించి విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందులో ఏడు పంచాయతీలకు సంబంధించి తుది నివేదికలు సైతం అతిత్వరలో జిల్లా కలెక్టర్‌కు సమర్పించేందుకు పంచాయతీ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే మహేశ్వరం మండలం తుమ్మలురు గ్రామ పంచాయతీ సర్పంచును తొలగించగా.. మేడ్చల్ మండలం ఎల్లంపేట మాజీ సర్పంచ్‌కు రికవరీ నోటీసులు అందించింది. రాజేంద్రనగర్ మండలం పుపాల్పగూడ మాజీ సర్పంచ్‌పై ఏకంగా క్రిమినల్ కేసు సైతం నమోదైంది. ఆ పంచాయతీలు ఇవే.. తాజాగా ఏడుగురు సర్పంచులపై జిల్లా పంచాయతీ శాఖ చర్యలు తీసుకునేం దుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి తుది విచారణ నివేదికలు కలెక్టర్‌కు సమర్పించనుంది. వీటిలో ము నుగనూరు (హయత్‌నగర్), మల్కీగూ డ (యాచారం), బొమ్మరాసిపేట (శామీర్‌పేట్), మణికొండ (రాజేంద్రనగర్), కిస్మత్పూర్ (రాజేంద్రనగర్), బాటసిం గారం (హయత్‌నగర్), తుర్కయాంజా ల్ (హయత్‌నగర్) గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో బొమ్మరాసిపేట, మణికొండ, బాటసింగారం, తుర్కయా ంజాల గ్రామ పంచాయతీలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారే స్వయ ంగా విచారణ చేపట్టడం గమనార్హం.


