
బావిలో పడిన ఐచర్
పట్టణ సమీపంలోని పైతోట వద్ద ఉన్న గాలి మారెమ్మ ఆలయం పక్కనే బావిలోకి ఐచర్ వాహనం పడింది.
రాయదుర్గం రూరల్ : పట్టణ సమీపంలోని పైతోట వద్ద ఉన్న గాలి మారెమ్మ ఆలయం పక్కనే బావిలోకి ఐచర్ వాహనం పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం అమావాస్య కావడంతో పాలు సరాఫరా చేసే వాహనాన్ని శుభ్రం చేసేందుకు గాలి మారెమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం వాహనాన్ని పక్కకు పెట్టాలని క్లీనర్ ఒక్కసారిగా అతివేగంతో వెళ్లగా బావిలోకి పడింది. గమనించిన స్థానికులు క్లీనర్‌ను బయటకు లాగారు. అదృష్టవశాత్తూ క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వాహనం దెబ్బతింది. విషయం తెలుసుకున్న సీఐ చలపతి సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.