మతోన్మాదాన్ని అరికట్టేందుకు కృషి | effort to control Communalism | Sakshi
Sakshi News home page

మతోన్మాదాన్ని అరికట్టేందుకు కృషి

Aug 22 2016 12:15 AM | Updated on Jul 11 2019 5:37 PM

దేశంలో మతోన్మాదాన్ని నివారించడానికి, మానవసంబంధాలను పటిష్టం చేయడానికి జమాఅతే ఇస్లామి హింద్‌ కృషి చేస్తోం దని జమా అతే ఇస్లామి హింద్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ సుభాన్‌ స్పష్టం చేశారు.

  • జమా అతే ఇస్లామి హింద్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ సుభాన్‌
  • పోచమ్మమైదాన్‌ : దేశంలో మతోన్మాదాన్ని నివారించడానికి, మానవసంబంధాలను పటిష్టం చేయడానికి జమాఅతే ఇస్లామి హింద్‌ కృషి చేస్తోం దని జమా అతే ఇస్లామి హింద్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ సుభాన్‌ స్పష్టం చేశారు. నగరంలో పోచమ్మమైదాన్‌లోని జమాఅతే ఇస్లామి హింద్‌ కార్యాలయంలో ఆదివారం ‘అఖిల భారత శాంతి మానవతల ఉద్యమం’పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భం గా సుబాన్‌ మాట్లాడుతూ జనమంతా lకలిసి ఆరాచకం, విధ్వంసాల నుంచి దేశాన్ని కాపాడాలని కోరారు. శాంతి యుత సమాజ నిర్మాణానికి పూనుకోవాలని ఆయన అన్నారు. 21 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు అఖిల భారత శాం తి మానవతల ఉద్యమం చేయాలని జమా అతే ఇస్లామి హింద్‌ నిర్ణయిం చిందన్నారు. ఉద్యమంలో భాగంగా గ్రూపు మీటింగ్‌లు, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం, ముస్లిమేతరులు, బడుగు బలహీనవర్గాల ప్రజలందరితో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. జమా అతే నగర అధ్యక్షుడు సాబీర్‌ అలీం, అఖిల భారత శాంతి మానవతల ఉద్యమం రాష్ట్ర కోకన్వీనర్‌ మహ్మద్‌ ఖాలీద్‌ స య్యద్,మిర్జా హూస్సేనీ బేగ్, ఇక్బాల్, అసియాతస్లీమ్, రజీ యాబేగం, ఆర్షద్, అయ్యూబ్‌ అలీ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement