విద్యుదాఘాతంతో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు మృతి | Eaieseph leader killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు మృతి

Sep 2 2016 1:02 AM | Updated on Sep 4 2017 11:52 AM

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న గోర్ల రఘుకుమార్‌(34) అనే ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

నందలూరు: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న గోర్ల రఘుకుమార్‌(34) అనే ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రఘుకుమార్‌ గురువారం సాయంత్రం నీటి మోటర్‌ను ఆన్‌ చేసేందుకు విద్యుత్‌ ప్లగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. మృతునికి భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు గోవర్ధన్, మూడేళ్ల కూతురు సాయిసౌజన్య ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement