నకిలీ నార విత్తనాలు స్వాధీనం | duplicate seeds identyfied | Sakshi
Sakshi News home page

నకిలీ నార విత్తనాలు స్వాధీనం

Jan 20 2017 9:52 PM | Updated on Sep 5 2017 1:42 AM

నకిలీ నార విత్తనాలు స్వాధీనం

నకిలీ నార విత్తనాలు స్వాధీనం

గుంటూరు వెస్ట్‌: అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 930 క్వింటాళ్ల నకిలీ నార విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 
 
గుంటూరు వెస్ట్‌: అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 930  క్వింటాళ్ల నకిలీ నార విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పాత గుంటూరుకు చెందిన తేజస్వి సీడ్స్‌ దుకాణం  యజమాని కొంత కాలంగా ఆటోనగర్‌లోని సాంబశివ ఇండస్త్రీస్‌లో నకిలీ విత్తనాలు శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ శోభామంజరి, వ్యవసాయ శాఖాధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులునిర్వహించారు.  స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.75 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. ఈదాడుల్లో అధికారులు కిషోర్, ఎ.ఒ. కె.వెంకటరావు, రమణకుమార్‌ పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement