మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని చేపడుతున్న ఉద్యమంలో మండల ప్రజలంతా భాగస్వాములు కావాలని అఖిలపక్ష నేతలు అన్నారు.
♦ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
♦ అఖిలపక్ష నాయకులు
♦ చిలుకూరు, అప్పోజీగూడలో సంతకాల సేకరణ
మొయినాబాద్: మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని చేపడుతున్న ఉద్యమంలో మండల ప్రజలంతా భాగస్వాములు కావాలని అఖిలపక్ష నేతలు అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని చిలుకూరు, అప్పోజీగూడ గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ..జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో కలుపొద్దని.. తూర్పురంగారెడ్డి జిల్లాలో కలపాలని చేపడుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. సంతకాల సేకరణకోసం ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సంతకాలు చేసి తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కలిపితే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలగడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకే సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకరవ్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గున్నాల సంగీత, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, పెంటయ్య, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, జయవంత్, ఆండ్రూ, వెంకటేష్ పాల్గొన్నారు.