నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు | dont make sara | Sakshi
Sakshi News home page

నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు

Oct 7 2016 11:21 PM | Updated on Sep 5 2018 8:44 PM

మాట్లాడుతున్న  ఎక్సైజ్‌ అధికారులు. - Sakshi

మాట్లాడుతున్న ఎక్సైజ్‌ అధికారులు.

నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పలాస యూనిట్‌ ఇన్‌చార్జి ఎక్సైజ్‌ సూపరిండెండెంట్‌ సీహెచ్‌ దాస్‌ అన్నారు. సోంపేట ఎక్సైజ్‌ కార్యాలయంలో ఇచ్ఛాపురం, సోంపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా పలాస యూనిట్‌ పరిధిలోని పలు మండలాల్లో నాటుసారా అక్రమ తయారీపై దాడులు నిర్వహించి అవగాహన కల్పించామని తెలిపారు.

సోంపేట: నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పలాస యూనిట్‌ ఇన్‌చార్జి ఎక్సైజ్‌ సూపరిండెండెంట్‌ సీహెచ్‌ దాస్‌ అన్నారు. సోంపేట ఎక్సైజ్‌ కార్యాలయంలో ఇచ్ఛాపురం, సోంపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా పలాస యూనిట్‌ పరిధిలోని పలు మండలాల్లో నాటుసారా అక్రమ తయారీపై దాడులు నిర్వహించి అవగాహన కల్పించామని తెలిపారు.

 

పలాస యూనిట్‌ పరిధిలో రామరాయి, చాపరాయి, బుడార్‌సింగ్, సవర బద్ర, రెంపి తదితర గ్రామాల్లో ఎక్సైజ్‌ సిబ్బంది తో కలసి దాడులు నిర్వహించామన్నారు. శుక్రవారం ఉదయం సవర కుద్ది గ్రామంలో దాడులు నిర్వహిస్తుండగా, గిరిజన మహిళలు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రసాదం కోసం నాటు సారా తయారు చేస్తున్నామని చెప్పారని, దీంతో వారికి నాటుసారా అనర్థాలపై అవగాహన కల్పించామని తెలిపారు. నాలుగు రోజులుగా నిర్వహించిన దాడులలో 11 వేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామని తెలిపారు. 250 లీటర్ల నాటు సారాయి పట్టుకుని  16 మంది ని అరెస్టు చేసి కేసులు పెట్టినట్లు వివరించారు. ఆయనతో పాటు ఇచ్చాపురం, సోంపేట, పలాస సీఐలు కె. మల్లికార్జునరావు, ఎ.ఖలీమ్, కె.నాగయ్య, ఎక్సైజ్‌ సిబ్బంది ఉన్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement