గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్ షిప్–2016 ఈనెల 7వ తేదీన చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్రరాజు గురువారం వెల్లడించారు.
7న జిల్లాస్థాయి చెస్ పోటీలు
Aug 4 2016 10:24 PM | Updated on Sep 4 2017 7:50 AM
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్ షిప్–2016 ఈనెల 7వ తేదీన చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్రరాజు గురువారం వెల్లడించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన నలుగురు క్రీడాకారులను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.100 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9948198809 నెంబరుకు సంప్రదించాలన్నారు.
Advertisement


