రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా యోగా జట్టు | District yoga team selected to State level competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా యోగా జట్టు

Sep 4 2016 11:15 PM | Updated on May 29 2019 2:58 PM

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా యోగా జట్టు - Sakshi

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా యోగా జట్టు

జిల్లా యోగా జట్టు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొననుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ హాల్లో ఆదివారం వారికి అభినందన కార్యక్రమం జరిగింది.

గుంటూరు స్పోర్ట్స్‌: జిల్లా యోగా జట్టు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొననుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ హాల్లో ఆదివారం వారికి అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా యోగా జట్టు క్రీడాకారులను అభినందించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా యోగా అసోసియేషన్‌ కార్యదర్శి తుమ్మా శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, వెంకట్, సురేష్‌ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement