అంతరజిల్లా క్రికెట్ పోటీల్లో జిల్లా క్రికెటర్లు సత్తా చాటారి. జిల్లా జుట్టు కెప్టెన్ కెఎస్‌ఎన్ రాజు సెంచరీతో ఆకట్టుకున్నారు. కొద్దిరోజులుగా విజయనగరంలో అండర్–14 బాలుర అంతరజిల్లా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాజట్టు శ్రీకాకుళం జట్టుతో తలపడింది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో జిల్లాజట్టు కెప్టెన్ కెఎస్‌ఎన్ రాజు అజేయంగా 142 పరుగులు చేసి అందరి మన్ననలు అందుక
పరుగులు పారిస్తున్న జిల్లా క్రికెటర్లు
Oct 25 2016 6:40 PM | Updated on Sep 4 2017 6:17 PM
ఏలూరు రూరల్ ః
అంతరజిల్లా క్రికెట్ పోటీల్లో జిల్లా క్రికెటర్లు సత్తా చాటారి. జిల్లా జుట్టు కెప్టెన్ కెఎస్‌ఎన్ రాజు సెంచరీతో ఆకట్టుకున్నారు. కొద్దిరోజులుగా విజయనగరంలో అండర్–14 బాలుర అంతరజిల్లా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాజట్టు శ్రీకాకుళం జట్టుతో తలపడింది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో జిల్లాజట్టు కెప్టెన్ కెఎస్‌ఎన్ రాజు అజేయంగా 142 పరుగులు చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. జాన్‌రిచార్డ్ 77 పరుగులతో అకట్టుకున్నాడు. వీరిద్దరూ మొదట ఇన్నింగ్స్‌లో సైతం 24, 35 పరుగులు చేశారు. శ్రీకాకుళం జట్టు సైతం జిల్లాజట్టుకు ధీటుగా రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోటీల్లో జిల్లా జట్టు బ్యాట్స్‌మెన్ రాణించడంపై అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్, బిఎస్ మంగేష్, వి విద్యాప్రసాద్, జిల్లా శిక్షకులు జి సత్యనారాయణ, షకీర్ హుస్సేన్, రామప్రసాద్, కాశీవిశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement