నంద్యాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు | district level games in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు

Jan 22 2017 12:38 AM | Updated on Sep 5 2017 1:46 AM

స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జిల్లా స్థాయి బాలుర క్రీడా పోటీలు ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నర్వహిస్తున్నట్లు గ్రూప్‌–1 అధికారి నాగస్వరం నరసింహులు, డిప్యూటీ ఈఓ సుమతిలు పేర్కొన్నారు.

- ఫిభ్రవరి 1 నుంచి 4 వరకు నిర్వహణ
నంద్యాల వ్యవసాయం: స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జిల్లా స్థాయి బాలుర క్రీడా పోటీలు ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నర్వహిస్తున్నట్లు గ్రూప్‌–1 అధికారి నాగస్వరం నరసింహులు, డిప్యూటీ ఈఓ సుమతిలు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ఫిక్సర్స్‌ కార్యక్రమంలో వారు మాట్లాడారు. జిల్లా స్థాయి పోటీల్లో  1800మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది.. 17 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సెంట్రల్‌ జోన్‌ చైర్మన్‌ ఎస్‌.అసదుల్లా మాట్లాడుతూ.. ఈ పోటీలు జూనియర్, సీనియర్‌ విద్యార్థులు హాజరవుతారన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు నాగస్వారం నరసంహులు సహకారంతో మెమొంటోలను అందజేస్తారన్నారు. మున్సిపల్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం హెచ్‌ఎం అసదుల్లా తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement