జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక | district criket team selected | Sakshi
Sakshi News home page

జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక

Sep 4 2016 11:44 PM | Updated on Sep 4 2017 12:18 PM

జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు

జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు

జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్‌ –19 క్రికెట్‌ ఎంపికలు హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ క్రికెట్‌ నెట్స్‌లో జరిగాయి.

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్‌ –19 క్రికెట్‌ ఎంపికలు హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ క్రికెట్‌ నెట్స్‌లో జరిగాయి. జిల్లా జట్టుకు ఎంపికైన క్రికెటర్లు ఈ నెల 6వ తేదీ నుంచి సంగారెడ్డిలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించే అండర్‌ – 19 క్రికెట్‌ టోర్నీలో పాల్గొంటుందని జిల్లా క్రికెట్‌  అసోసియేషన్‌ కార్యదర్శి చేకూరి వెంకట్, మెగా యూత్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి ఎండీ మసూద్‌లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రికెటర్లు హాజరు కాగా వారికి ఎంపికలు నిర్వహించి 14 మంది క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. జట్టుకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించారు. జట్టు వివరాలు: టీవీఎస్‌ నారాయణ, పి. భరత్, కె. సాయిసత్యతేజ, వి. విరించి, టి. నరేష్‌ సింగ్, పి. జయదేవ్, డి. సూర్య, పి. రాజేష్, జి, ధీరజ్, ఎం. ఠాగూర్, ఎస్‌. డి మహ్మద్‌హుస్సేన్, హేమంత్, కె. రవి, జి. వినోద్‌లు ఎంపికయ్యారు.


 

Advertisement
 
Advertisement
Advertisement