నిర్మల్‌ జిల్లా కోసం పాదయాత్ర | district bifurcation | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లా కోసం పాదయాత్ర

Jul 25 2016 11:14 PM | Updated on Sep 4 2017 6:14 AM

నిర్మల్‌ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటును అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్మల్‌ జిల్లా సాధన సమితి కన్వీనర్‌ నాయిడి మురళీధర్, కో–కన్వీనర్లు డాక్టర్‌ కృష్ణంరాజు, గండ్రత్‌ రమేశ్‌ తెలిపారు.

  • నిర్మల్‌ నుంచి బాసర
  • అఖిలపక్ష సమావేశంలో జిల్లా సాధన సమితి
  • నిర్మల్‌రూరల్‌ : నిర్మల్‌ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటును అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్మల్‌ జిల్లా సాధన సమితి కన్వీనర్‌ నాయిడి మురళీధర్, కో–కన్వీనర్లు డాక్టర్‌ కృష్ణంరాజు, గండ్రత్‌ రమేశ్‌ తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో సోమవారం అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న నిర్మల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని, 29న బాసరకు చేరుకుంటామని అన్నారు.
     
    సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొంటునప్పటికీ పూర్తి అధికారిక ప్రకటన వెలువడే వరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్‌ నియోజకవర్గాలు, నేరేడిగొండ, బోథ్‌ ప్రాంతాల ప్రజలు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రలో వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన సమితి, పార్టీలు, సంఘాల నాయకులు ఎంబడి రాజేశ్వర్, బొలిశెట్టి రాజేశ్, మాకు సాయి, ద్యాగ ప్రచోదయ్, వెంకటేశ్, అబ్దుల్‌ అజీజ్, ప్రవీణ్, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement