మూడెకరాల భూమి ఇవ్వాలి | distribute three ecores land to tribles | Sakshi
Sakshi News home page

మూడెకరాల భూమి ఇవ్వాలి

Jul 21 2016 1:18 AM | Updated on Sep 4 2017 5:29 AM

ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ  జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దళితులు, గిరిజనులకు ఇస్తామన్న మూడెకరాల భూమి వెంటనే ఇవ్వాలని, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని, రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇ.సాగర్, కె.అయోధ్య, నగేష్, బి.వి చారి, చైతన్య, హరికృష్ణ, సుధాకర్‌రెడ్డి, నర్సింహ, ప్రవీణ్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement