8 కి .మీ. దాటితే టీఏ,డీఏ ఇవ్వాల్సిందే | distance in 8k.m given ta,da's | Sakshi
Sakshi News home page

8 కి .మీ. దాటితే టీఏ,డీఏ ఇవ్వాల్సిందే

Mar 29 2016 1:57 AM | Updated on Sep 26 2018 3:36 PM

పదో తరగతి స్పాట్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైబడి హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ టీఏ, డీఏ ఇవ్వాలని

యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి స్పాట్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైబడి హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ టీఏ, డీఏ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయు లు, గాలయ్య సోమవారం డిమాండ్ చేశారు. వాల్యూయేషన్‌కు వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ఐదేళ్లుగా హయత్‌నగ ర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ జరుగుతుందని, 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి టీచర్లు వచ్చి ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. కానీ వారికి తగిన భత్యం ఇవ్వకుండా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు.  ఇప్పటి నుంచి అయినా.. ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే ప్రతి ఉపాధ్యాయుడికి దినసరి భత్యం సంతృప్తికరంగా ఇవ్వాలని వారు ఈ మేరకు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement