‘మహిళలపై వివక్ష దారుణం’ | Discrimination on Womens | Sakshi
Sakshi News home page

‘మహిళలపై వివక్ష దారుణం’

Jul 16 2016 3:27 AM | Updated on Jul 28 2018 3:33 PM

‘మహిళలపై వివక్ష దారుణం’ - Sakshi

‘మహిళలపై వివక్ష దారుణం’

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలపై వివక్ష చూప డం దారుణమని సర్పంచ్‌ల సంఘం జిల్లా..

శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలపై వివక్ష చూప డం దారుణమని సర్పంచ్‌ల సంఘం జిల్లా అ ధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ సీపీ  కార్యాల యంలో ఆయన శుక్రవారం విలేకరులతో మా ట్లాడారు. రెండేళ్లలో ఐసీడీఎస్ మొదలుకుని రెవెన్యూ వరకు అన్నింటా మహిళలకు వివక్షలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఆరుగురు సభ్యులను నియమించినా జిల్లాకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది ఆకలి కేకలు ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రికీ వినిపించడం లేదన్నారు.

మంత్రి ఇలాకాలో ఉన్న టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి సేవలు నానాటికీ నీరుగారుతున్నాయని ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలు ఇ ప్పటికే బాబును నమ్మి మోసపోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement