దడ పుట్టిస్తున్న డయేరియా | Diarrhoea fear at puskara ghats | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న డయేరియా

Aug 17 2016 6:02 PM | Updated on Oct 1 2018 5:19 PM

తాడేపల్లిలో నీటి నమూనాను పరీక్షిస్తున్న ఎనలిస్ట్‌ - Sakshi

తాడేపల్లిలో నీటి నమూనాను పరీక్షిస్తున్న ఎనలిస్ట్‌

పుష్కరాల్లో డయేరియా దడపుట్టిస్తోంది. ప్రారంభ రోజు నుంచి డయేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

* రోజురోజుకు పెరిగిపోతున్న బాధితులు
* కలుషిత నీరు, ఆహారం తీసుకోవడమే కారణం
* ఇప్పటివరకు 486మందికి వైద్యం
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
 
గుంటూరు మెడికల్‌ : పుష్కరాల్లో డయేరియా దడపుట్టిస్తోంది. ప్రారంభ రోజు నుంచి డయేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలిరోజు 52 మంది, 13వతేదీ 104 మంది, 14వ తేదీ 113 మంది, 15వ తేదీ 97 మంది, 16వ తేదీ మంగళవారం 120 మంది డయేరియాతో బాధపడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాల్లో చికిత్స పొందారు.  కలుషితమైన మంచినీరు తాగటం, శుభ్రంగా లేని ఆహారం భుజించటం వల్లే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియా సోకినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా  ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. పిల్లల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్యుల సంఘం జిల్లా సెక్రటరీ డాక్టర్‌ టి. చంద్రశేఖరరెడ్డి తెలిపారు. డయేరియా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వైద్యులు, ౖవైద్యాధికారులు అప్రమత్తమవ్వటంతో పాటుగా పుష్కరాలకు వచ్చే భక్తులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు.
 
13,297 మందికి వైద్యసేవలు....
జిల్లాలో వివిధ పుష్కరఘాట్‌లలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో మొత్తం 13,297 మంది వివిధ రోగాలతో వైద్యసేవలను పొందారు. జ్వరంతో బాధపడుతున్న 403 మందికి, వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్న 871 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 3783 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 210 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 541 మందికి, డయేరియాతో బాధపడుతున్న 120 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్‌ తిరుమలశెట్టి పద్మజారాణి  వెల్లడించారు. పుష్కరాల్లో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు 54,239 మందికి వైద్యసేవలను అందించామని ఆమె వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement