ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరులో శనివారం జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని.. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన ప్రజల సహకరంతోనే సాధ్యమైందన్నారు. అలాగే ఆలేరు రైల్వేగేట్ విషయంలో 5వేల మందితో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. తాను ఎక్కడ ఉన్న ఆలేరు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. అలాగే యాదాద్రి జిల్లా ఏర్పాటైనందున యాదగిరిగుట్టలో అక్టోబర్ 2న అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే టీడీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజల బాగోగులు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో అమరేందర్‌రెడ్డి, ఇస్తారి, రాములు, సలీం, దానయ్య, బాలయ్య, మల్లేశం, మల్లేశం, సంతోష్, శ్రీను, పెద్దఉప్పలయ్య, రాజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.