డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి | degree student santhoshini death mystery in siddipet | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

May 29 2017 1:37 PM | Updated on Sep 5 2017 12:17 PM

డిగ్రీ విద్యార్థిని సంతోషిణి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు.

సిద్ధిపేట: డిగ్రీ విద్యార్థిని సంతోషిణి అనుమానాస్పద మృతిపై ఎలాంటి అపోహలకు తావులేదని, నిస్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ శివకుమార్‌ తెలిపారు. వైద్యబృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. మృతురాలి ఒంటిపై పైకి కనిపించే గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ వస్తేనే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని విచారించినట్టు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సందేశాలు, సమాచారం ఉన్నా ఏసీపీకి తెలియజేయవచ్చని చెప్పారు.

మరోవైపు పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సిరిసినగండ్ల గ్రామస్తులు పేర్కొన్నారు. అత్యాచారం చేసి చంపేసారని ఆరోపించారు. సంతోషిణి మృతికి పద్మావతి అనే మహిళ ఆమె కుమారుడు కారణమని అంటున్నారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement