ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ డిగ్రీ విద్యార్థి | degree student caught writing Inter exam | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ డిగ్రీ విద్యార్థి

Mar 9 2016 11:20 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ డిగ్రీ విద్యార్థి పట్టుబడ్డాడు.

తాండూరు రూరల్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ డిగ్రీ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన తాండూరు అంబేద్కర్ సెంటినరీ జూనియర్ కళాశాల్లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. యాలాల మండలం కొకట్ పంచాయతీ బామ్లనాయక్‌తండాకు చెందిన రాథోడ్ నవీన్ తాండూరు చైతన్య జూనియర్ కళాశాల్లో ఇంటర్ (సీఈసీ) ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. వార్షిక పరీక్షల్లో భాగంగా నవీన్ హాల్ టికెట్ నంబర్ (1615212837) అంబేద్కర్ సెంటినరీ కళాశాల్లో పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్నాడు. బుధవారం జరిగిన పౌరశాస్త్రం పరీక్షను రాసేందుకు నవీన్ బదులు స్థానిక పీపుల్స్ డిగ్రీ కళాశాల్లో డిగ్రీ ద్వితీయ ఏడాది చదువుతున్న బానోత్ నవీన్‌కుమార్ హాజరయ్యాడు.

అయితే హాల్‌టిక్కెట్‌లో ఉన్న సంతకానికి, విద్యార్థి పెట్టిన సంతానికి తేడాను గుర్తించిన ఇన్విజిలేటర్ వెంటన్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పరీక్ష కేంద్రానికి వచ్చి వివరాలు సేకరించగా డిగ్రీ విద్యార్ధి బానోత్ నవీన్‌కుమార్‌గా గుర్తించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు డిగ్రీ విద్యార్థి బానోత్ నవీన్‌కుమార్‌ను బుధవారం పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement