డీలర్ దారుణ హత్య | dealer murder in ananthapuram district | Sakshi
Sakshi News home page

డీలర్ దారుణ హత్య

Feb 5 2016 11:29 AM | Updated on Jul 30 2018 8:29 PM

వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

ఆత్మకూరు: వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రమణ (30) డీలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమంలో నిన్న రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు రాడ్లతో దాడి చేశారు. దీంతో తలపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement