సీపీఎస్‌తో ఉద్యోగులకు నష్టం | cps will damage employees benefits | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌తో ఉద్యోగులకు నష్టం

Apr 28 2016 5:05 PM | Updated on Jun 1 2018 8:39 PM

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వల్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున్న నష్టం వస్తుందని కొత్త విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు.

- కొత్త విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్‌
- శంఖారవం ర్యాలీ, కలెక్టరేట ముట్టడి


అనంతపురం
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వల్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున్న నష్టం వస్తుందని  కొత్త విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో గురువారం ఆర్ట్స్ కళాశాల నుంచి సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శంఖారావం ర్యాలీని కలెక్టరేట్ వరకు నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగ సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. 2004, సెప్టెంబరు ఒకటిన ఉద్యోగంలోకి చేరిన వారికి సీపీఎస్ విధానం అమలు చేస్తూ ప్రభుత్వం 653, 654, 655 జీఓలను జారీ చేసిందన్నారు. పెన్షన్‌లో ఇలా కొత్త విధానం ప్రవేశపెట్టి ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాస్తోందని ఆగ్రహించారు. ఐదేళ్లు సేవ చేసే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పాత పెన్షన్ వర్తింపజేస్తున్నారన్నారు. ఇదొక్కటే కాకుండా మరెన్నో ప్రయోజనాలను అందిస్తోందన్నారు. అదే 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు సేవ చేసే ఉద్యోగులకు మాత్రం పెన్షన్, కనీస ప్రయోజనాలు లేకుండా చేశారని మండిపడ్డారు.

సీపీఎస్ పరిధిలోని ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే దహన సంస్కార ఖర్చులకు రూ.10 వేలు తప్ప ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాదన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరోకటి ఉండదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత మొత్తం డబ్బులు ఒకేసారి భారీగా వస్తుందని ప్రభుత్వం చెబుతోందే తప్ప అది ఎంతని మాత్రం చెప్పడం లేదన్నారు. ఆ వచ్చే మొత్తానికి పన్ను విధిస్తామని చెబుతోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులు 18 మంది వివిధ కారణాలతో చనిపోయారని, వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం అందలేదన్నారు. భవిష్యత్తులో ప్రతి సీపీఎస్ ఉద్యోగికి ఇదే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.


సీపీఎస్ రద్దు డిమండ్‌తో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఆందోళనకు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, రెవెన్యూ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఫరూక్, వ్యవసాయ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుప్రకాశ్, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement