పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట | couple seeks security | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Sep 1 2016 12:08 AM | Updated on Aug 21 2018 5:54 PM

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

వాకాడు: వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన చందన, కస్తూరయ్యలు కొంతకాలంగా ప్రేమించుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు.

వాకాడు: వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన చందన, కస్తూరయ్యలు కొంతకాలంగా ప్రేమించుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఐతే వీరిద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమజంట ఇంటి నుంచి వెళ్లిపోయి ఈ నెల 26న జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల వారు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆ మేరకు జిల్లా ఎస్పీ వాకాడు పోలీసులకు అప్పజెప్పారు. దీంతో వాకాడు ఎస్‌ఐ సుధాకర్‌ ప్రేమ జంట ఇద్దరు మేజర్‌ కావడంతో ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమ జంటను కొన్నాళ్ళు అబ్బాయి బంధువుల వద్ద ఉండాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement