మెడికో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ | Counselling for Medicine students | Sakshi
Sakshi News home page

మెడికో విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Aug 17 2016 1:41 AM | Updated on Oct 16 2018 3:25 PM

మెడికో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ - Sakshi

మెడికో విద్యార్థులకు కౌన్సెలింగ్‌

నెల్లూరు(అర్బన్‌) : దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 144 మందికి సీట్లను కేటాయించింది.

 
 
నెల్లూరు(అర్బన్‌) : దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 144 మందికి సీట్లను కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సోమ, మంగళవారాల్లో కలిపి 80 మంది కళాశాలలో చేరేందుకు వచ్చారు. వీరందరికీ ప్రిన్సిపాల్‌ రవిప్రభు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సర్టిఫికెట్‌లను పరిశీలించారు. ఆరోగ్య ఫిట్‌నెస్‌ పరీక్షలు జరిపి ఎంబీబీఎస్‌ కోర్సులో చేర్చుకున్నారు. మిగతా విద్యార్థులు కూడా రెండు రోజుల్లో రానున్నారు. మరో 6 సీట్లను ఎన్‌సీసీ, నేవీ, మిలిటరీ తదితర స్పెషల్‌ కోటా కింద ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కేటాయించనుంది. వారు కూడా వస్తే మొత్తం 150 సీట్లు నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో భర్తీ కానున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement