కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి | contract lecturers should be Regulate | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

Jan 8 2017 10:21 PM | Updated on Mar 22 2019 6:18 PM

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి - Sakshi

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

► అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవహారం
నిర్మల్‌ రూరల్‌ : ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట లెక్చరర్లతో కలిసి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు లోక లక్ష్మారెడ్డి, టీడీపీ, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు గండ్రత్‌ రమేశ్, అయ్యన్నగారి పోశెట్టి తదితరులు మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల బేసిక్‌ పే, డీఏ, రెగ్యులరైజేషన్ వంటి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు ఎస్‌ఎన్ రెడ్డి, రాంలక్ష్మణ్, ఏబీవీపీ నాయకులు మెహర్, టీఎన్ ఎస్‌ నాయకులు శ్రీకాంత్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్గ రవీందర్, నాయకులు వెంకటేశ్, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement