భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి | continued to buvanagiri division | Sakshi
Sakshi News home page

భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి

Sep 8 2016 1:37 AM | Updated on Mar 19 2019 9:23 PM

భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి - Sakshi

భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి

రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు.

రాజాపేట : రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం డివిజన్‌లో ఆలేరు, రాజాపేట మండలాలను కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చామకూరు గోపాల్‌గౌడ్, మెండు శ్రీనివాస్‌రెడ్డి, గుంటి కష్ణ, గుర్రాల బాలమల్లు, మర్ల సిద్దిఎల్లయ్య, కోరుకొప్పుల శీరీష, ఉప్పరి లావణ్య, నాయకులు దాచపల్లి శ్రీనివాస్, ఉప్పరి నరేష్, కోరుకొప్పుల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement