పుష్కర సేవ ప్రశంసనీయం | congrats on pushkara service | Sakshi
Sakshi News home page

పుష్కర సేవ ప్రశంసనీయం

Aug 12 2016 9:08 PM | Updated on May 25 2018 5:52 PM

భూత్పూర్‌: పుష్కర భక్తులకు తాగునీటిని అందించేందుకు ఉచిత మినరల్‌ వాటర్‌ పంపిణీ చేసేందకు గ్రామ యువత ముందుకు రావడం సంతోషయదాకమని డీఎస్పీ రవీందర్‌రెడ్డి అభినందించారు.

–డీఎస్పీ రవిందర్‌రెడ్డి
భూత్పూర్‌: పుష్కర భక్తులకు తాగునీటిని అందించేందుకు ఉచిత మినరల్‌ వాటర్‌ పంపిణీ చేసేందకు గ్రామ యువత ముందుకు రావడం సంతోషయదాకమని డీఎస్పీ రవీందర్‌రెడ్డి అభినందించారు. కృష్ణ పుష్కరాల భక్తులకు తాగునీటి కోసం మినరల్‌ వాటర్‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి మినరల్‌ వాటర్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి కృష్ణపుష్కరాలకు వెళ్లే భక్తులు తాగునీటి ఇబ్బందులు పడకుండా నీటి పంపిణీ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రాందాస్, రత్నయ్య, విజయ్, సతీష్, రమాకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement