నీట్ (ఎంబీబీఎస్)తోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించాలని ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీఖాన్ డిమాండ్‌చేశారు
పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో నిర్వహించాలి
Feb 10 2017 11:11 PM | Updated on Sep 26 2018 3:25 PM
కర్నూలు (న్యూసిటీ) : నీట్ (ఎంబీబీఎస్)తోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించాలని ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీఖాన్ డిమాండ్‌చేశారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఎన్నికల హామీల మేరకు ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆలీఖాన్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి నబీరసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లీంలు అధికంగా ఉన్న ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఉర్తూ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్ దీక్షలకు మద్దతు తెలిపారు. నబీ రసూల్, రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ, అజయ్‌కుమార్ దీక్షల్లో కూర్చున్నారు. మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీంఖాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు షాలీబాషా, కోశాధికారి షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement