ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ పోలవరం పనులను పరిశీలించి సీఎం రాకకు సంబంధించి చేపట్టే పనులకు అధికారులకు పలు సూచనలిచ్చారు. ఎస్పీ భాస్కరభూషణ్ గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను ఆయన ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలించారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లో పోలీస్‌దళా
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Sep 13 2016 12:13 AM | Updated on Mar 21 2019 8:35 PM
పోలవరం రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ పోలవరం పనులను పరిశీలించి సీఎం రాకకు సంబంధించి చేపట్టే పనులకు అధికారులకు పలు సూచనలిచ్చారు. ఎస్పీ భాస్కరభూషణ్ గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను ఆయన ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలించారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లో పోలీస్‌దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. హెలీకాఫ్టర్ సోమవారం ట్రయల్ రన్ వేసింది. ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు వ్యూపాయింట్ వద్ద హెలీకాఫ్టర్‌లో నుంచి దిగి అక్కడి నుంచి స్పిల్‌వే ప్రాంతంలో కొత్తగా అమర్చిన ఎక్స్‌వేటర్‌ను ఆయన ప్రారంభిస్తారు. అక్కడ నుంచి స్పిల్ ఛానల్ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంలో ఇరిగేషన్ సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో పనులు జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement