
రైలు కిందపడి యువకుడు దుర్మరణం
రాజంపేట రైల్వేస్టేషన్‌లో కడప వైపు ఉన్న సిగ్నల్ పాయింట్ వద్ద పట్టణంలోని సాయినగర్‌కు చెందిన నరసింహ(34) అనే యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్‌లో కడప వైపు ఉన్న సిగ్నల్ పాయింట్ వద్ద పట్టణంలోని సాయినగర్‌కు చెందిన నరసింహ(34) అనే యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రాత్రి ఇంటి నుంచి రెండో సినిమాకు అని వెళ్లిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు. సాయినగర్‌లో హోటల్ నిర్వహిస్తూ జీవిస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు రైలుకిందపడ్డాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియరాలేదు. రేణిగుంట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ తెలిపారు.