కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు ఆదివారం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు ఆదివారం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు వైద్యులు జీఎన్ రావు, జి.చంద్రశేఖర్ కంటి వైద్య పరీక్షలు చేశారు. కంటికి సంబంధించిన వైద్యం ఇక మీదట సీఎం ఇంటికి వెళ్లి చేస్తామని వైద్యులు తెలిపారు.
అంతకుముందు ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎండీ గుళ్లపల్లి నాగేశ్వరరావు, పెనమలూరు శాసనసభ్యుడు బోడెప్రసాద్, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.