కరువు రహిత జిల్లాగా అభివృద్ధి చేస్తాం | cm statement on anantapur drought | Sakshi
Sakshi News home page

కరువు రహిత జిల్లాగా అభివృద్ధి చేస్తాం

Dec 3 2016 12:01 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురంను కరువు రహిత జిల్లాగా అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

పెనుకొండ రూరల్‌ : అనంతపురంను కరువు రహిత జిల్లాగా అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హంద్రీనీవా జలాశయంలో నీటిని విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా రిజర్వాయర్‌ పూర్తిగా నిండితే ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. శెట్టిపల్లి వంకకు రూ.7కోట్ల 13 లక్షలు, గోనిపేట వంకకు రూ.6 కోట్ల 2 లక్షల నిధులతో  వంతెనలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దుద్దేబండ క్రాస్‌ సమీపంలో ఉన్న టూరిజం గెస్ట్‌హౌస్‌ ముందు రూ.85 లక్షలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement