పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలి | cm review on august 15th celebrations | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలి

Aug 3 2016 1:07 AM | Updated on Jul 12 2019 4:35 PM

అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు.

అనంతపురం అర్బన్‌: అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌... జేసీ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్ధీన్, ట్రైనీ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్వర్తించాల్సిన విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకల నిర్వహణకు ఇన్‌చార్జిగా జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతంని నియమించారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ట్రాఫిక్‌ ఐలాండ్లు, వేడుకలు జరుగనున్న పీటీసీ మైదానాన్ని సుందరంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లాఓబుళేసు, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మైదానాన్ని అందంగా అలంకరించడంతో పాటు 10 సై్క బెలూన్లను ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ నాగభూషణంని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement