సిద్దిపేట, గజ్వేల్‌కేనా సీఎం? | CM only for gajwel, siddipeta? | Sakshi
Sakshi News home page

సిద్దిపేట, గజ్వేల్‌కేనా సీఎం?

Aug 23 2016 5:42 PM | Updated on May 29 2018 2:42 PM

సంజీవరావు - Sakshi

సంజీవరావు

కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకేనా అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు ప్రశ్నించారు.

అల్లాదుర్గం: కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకేనా అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేయాల్సిన సీఎం, మంత్రులు గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకే వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.

ఇతర నియోజక వర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తన్నారని ఆరోపించారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సక్రమంగా లేదని మండిపడ్డారు. అందోల్‌ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసిన ఎమ్మెల్యే బాబూమోహన్‌ నోరు మెదపడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులకు పట్టించుకోకుండా డబ్బు మూటలు దాచుకొవడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement