సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ తో ప్రయాణికుల ఇక్కట్లు | CM Convoy trail run struks traffic | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ తో ప్రయాణికుల ఇక్కట్లు

Apr 24 2016 6:02 PM | Updated on Sep 3 2017 10:39 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్న నేపధ్యంలో పోలీసులు రాజంపేట రోడ్డులో ఆదివారం సాయంత్రం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

కడప కార్పొరేషన్ (వైఎస్సార్ జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్న నేపధ్యంలో పోలీసులు రాజంపేట రోడ్డులో ఆదివారం సాయంత్రం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీని కోసం 40 నిముషాలపాటు ట్రాఫిక్‌ను ఆపేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. మండుతున్న ఎండలో వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల బాధ వర్ణింపనలవి కాదు. పోలీసుల వైఖరితో ఆగ్రహించిన ప్రయాణికులు వాదనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement