ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ టీనాదాబి సన్మాన సభ ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఇంజినీర్ కొర్లపాటి విజయకుమార్ తెలిపారు.
25న సివిల్స్ టాపర్ టీనాదాబికి సన్మానం
Jul 21 2016 11:35 PM | Updated on Apr 8 2019 6:21 PM
విజయవాడ (గాంధీనగర్) :
ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ టీనాదాబి సన్మాన సభ ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఇంజినీర్ కొర్లపాటి విజయకుమార్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సన్మానానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. టీనాదాబీతో సహా ఇతర సివిల్స్ టాపర్స్ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తారన్నారు. టీనాదాబి మధ్యప్రదేశ్‌లో దళిత కుటుంబంలో జన్మించారని, సివిల్స్ చరిత్రలో దళిత యువతి టాపర్‌గా నిలవడం ఇదే ప్రథమమన్నారు. సన్మాన సభకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ పల్లెపోగు సీమోను, ఎస్.రాజన్‌బాబు, గొర్రె గాంధీ, పోలుమట్ల విజయ్‌కుమార్, పరిశపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement