స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చర్చి శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది.
అగ్నిప్రమాదంలో చర్చి దగ్ధం
Jan 16 2017 12:00 AM | Updated on Apr 3 2019 7:53 PM
కోడుమూరు రూరల్ : స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చర్చి శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. శనివారం చర్చి నిర్వాహకులు కుమార్ వ్యక్తిగత పనులపై ఇతర ఊళ్లకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో మంటలు చెలరేగి ఫర్నీచర్, మైక్ సిస్టమ్, బీరువా, సోలార్‌సిస్టమ్, వంటసామగ్రి కాలిపోయాయి. జనసంచారం లేని ప్రాంతంలో చర్చి ఉండడంతో అగ్ని ప్రమాద విషయాన్ని త్వరగా పసిగట్టలేకపోయారు. చర్చి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు.
Advertisement
Advertisement