క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. ఏపీఎస్పీ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. ఇది క్రైస్తవులు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళి జరుపుకొనే గొప్ప పర్యదినంగా
క్రీస్తు మార్గం అనుసరణీయం
Dec 25 2016 11:22 PM | Updated on Sep 4 2017 11:35 PM
కాకినాడ రూరల్ :
క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. ఏపీఎస్పీ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. ఇది క్రైస్తవులు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళి జరుపుకొనే గొప్ప పర్యదినంగా భావించాలన్నారు. క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. శాంతాక్లాజ్ పిల్లలకు బహుమతులు ఇవ్వడం, బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తొలుత కేక్‌ను కట్ చేసి, క్యాండిల్స్‌ను వెలిగించి క్రిస్మస్‌కు స్వాగతం పలికారు. చర్చివారు ఏర్పాటు చేసిన దుప్పట్లు, చీరలు, పంచెలను కన్నబాబు, ఏపీఎస్పీ కమాండెంట్ జె.కోటేశ్వరరావు 350 మందికి అందజేశారు. వ్యవసాయశాఖ డీడీ పి.ఆదరణకుమార్, సంఘం అధ్యక్షులు పి.దేవకుమార్, ఉపాధ్యక్షులు జా¯ŒSసన్, కార్యదర్శి ఐఎస్‌పీ కుమార్, కోశాధికారి బి.శ్రీధర్ తదితరులు మాట్లాడారు. మాజీ సర్పంచ్‌లు బొమ్మిడి శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ, శెట్టి బాబూరావు, భాషా, కురసాల సత్యనారాయణ, జంగా గగారి¯ŒSతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement