breaking news
selebrations
-
‘గాడ్’ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబు
నేటి నుంచి పీఠంలో పూజలు ప్రారంభం 19న పీఠానికి ప్రముఖుల రాక వెదురుపాక(రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠాదిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబైంది. గాడ్ జన్మదిన వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పీఠం పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) సోమవారం విలేకరులకు తెలిపారు. మంగళవారం ఉదయం ఉదయం 11.05 గంటలకు జ్యోతి ప్రజ్వలన, గోపూజ, లక్షీ్మగణపతి హోమంతో మూడు రోజుల పాటు జన్మదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు.. గాడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తజన సంక్షోభ నివారణార్థం పీఠంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ఆధ్మాతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా మంగళవారం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం పండితులు శ్రీసుబ్రహ్మణ్య త్రిశతి హోమం, సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పండితులు స్వామి వారి దివ్యకల్యాణం, 18న ఉదయం 9గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం తిరుమల వైఖానస పండితులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 19న పీఠానికి ప్రముఖుల రాక... 19న గాడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీఠంలోని విజయవేంకటేశ్వరస్వామి, వల్లీదేవసేససమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం, హారతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గాడ్ జన్మదిన వేడుకలకు బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం ఛైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రముఖులతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. -
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.. మేరీ మేరీ క్రిస్మస్
పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి, సత్యం, ధర్మం, శాంతి, దయ, ప్రేమ మార్గంలో మనందరం నడవాలని లోకానికి బోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆదివారం జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్నారు. పలు చర్చిల్లో పశువుల పాకలో క్రీస్తు జననాన్ని తెలిపే ఇతివృత్తాలను ప్రదర్శించారు. వాటి ముందు కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనలు చేశారు. విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ పాటలు పాడారు. కేక్‌లు కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాస్టర్లు భక్తి సందేశాన్ని వినిపించారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
కాకినాడ రూరల్ : క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. ఏపీఎస్పీ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. ఇది క్రైస్తవులు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళి జరుపుకొనే గొప్ప పర్యదినంగా భావించాలన్నారు. క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. శాంతాక్లాజ్ పిల్లలకు బహుమతులు ఇవ్వడం, బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత కేక్‌ను కట్ చేసి, క్యాండిల్స్‌ను వెలిగించి క్రిస్మస్కు స్వాగతం పలికారు. చర్చివారు ఏర్పాటు చేసిన దుప్పట్లు, చీరలు, పంచెలను కన్నబాబు, ఏపీఎస్పీ కమాండెంట్ జె.కోటేశ్వరరావు 350 మందికి అందజేశారు. వ్యవసాయశాఖ డీడీ పి.ఆదరణకుమార్, సంఘం అధ్యక్షులు పి.దేవకుమార్, ఉపాధ్యక్షులు జా¯ŒSసన్, కార్యదర్శి ఐఎస్పీ కుమార్, కోశాధికారి బి.శ్రీధర్ తదితరులు మాట్లాడారు. మాజీ సర్పంచ్‌లు బొమ్మిడి శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ, శెట్టి బాబూరావు, భాషా, కురసాల సత్యనారాయణ, జంగా గగారి¯ŒSతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.