ఘనంగా క్రిస్మస్ వేడుకలు | christmas celebrations in telugu states | Sakshi
Sakshi News home page

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Dec 25 2015 9:57 AM | Updated on Sep 3 2017 2:34 PM

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం జరిగిన మొదటి ఆరాధాన కార్యక్రమంలో సుమారు 50 వేల మంది వరకు పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం, గీతాలాపన తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటలకు రెండవ ఆరాధాన జరగనుంది. మధ్యాహ్నం తర్వాత సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రార్థనలకు రానున్నట్టు తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement