23న రాజ్‌విహార్‌ సెంటర్‌లో క్రిస్మస్‌ సందడి | Christmas celebration on 23rd at rajvihar | Sakshi
Sakshi News home page

23న రాజ్‌విహార్‌ సెంటర్‌లో క్రిస్మస్‌ సందడి

Dec 4 2016 12:06 AM | Updated on Sep 4 2017 9:49 PM

స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఈనెల 23 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు క్రిస్మస్‌ సందడి నిర్వహిస్తున్నట్లు జాతీయ ఎస్సీ, ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు ఆర్‌.రాజ్‌కుమార్‌ తెలిపారు.

కర్నూలు (టౌన్‌) ;  స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఈనెల 23 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు క్రిస్మస్‌ సందడి నిర్వహిస్తున్నట్లు జాతీయ ఎస్సీ, ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు ఆర్‌.రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు వివరించారు. ఇదే సందర్భంగా క్రిస్మస్‌ సందడి  పోస్టర్‌ను విడుదల చేశారు. ఏటా దేశ వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న క్రిస్మస్‌ పండుగను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పండుగగా చూస్తున్నాయన్నారు. అందువల్లే ఈ వేడుకల్లో మంత్రులు, ప్రభుత్వ ఆధికారులు పాల్గొనడం లేదని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement