సినిమా ఫక్కీలో మంగళవారం చోరీ జరిగింది.
సినిమా ఫక్కీలో చోరీ..
Apr 25 2017 11:26 PM | Updated on Aug 13 2018 4:19 PM
జూపాడుబంగ్లా: సినిమా ఫక్కీలో మంగళవారం చోరీ జరిగింది. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. తరిగోపుల గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో సాయన్న నందికొట్కూరు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోంచి రూ.90వేల నగదును డ్రాచేసుకొని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆటోలో నందికొట్కూరు నుంచి తరిగోపులకు బయలుదేరాడు. మార్గమద్యలో నందికొట్కూరు నీలిశికారీపేటలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి సాయన్న పక్కలో కూర్చున్నారు. ఆటో రబ్బాని వేర్‌హౌస్ వద్దనున్న పెట్రోల్‌బంక్ వద్ద డీజిల్ పోయించుకునేందుకు డ్రైవర్ నిలబెట్టాడు. ఈలోగా సాయన్న ప్యాంట్ జేబులోంచి రూ.90వేల నగదును దోచుకున్న దుండగులు నీళ్లు తాగేందుకనే వంకతో ఆటోలోంచి దిగి వెళ్లిపోయారు. జూపాడుబంగ్లాకు చేరుకున్నాక జేబు తడుముకోగా డబ్బులు కనిపించకపోవటంతో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Advertisement


