దుద్దుల కోసం చిన్నారి చెవి కోసిన కిలాడీ | Chinnari Chevi kosina kiladi | Sakshi
Sakshi News home page

దుద్దుల కోసం చిన్నారి చెవి కోసిన కిలాడీ

Nov 9 2015 11:55 PM | Updated on Oct 2 2018 3:40 PM

దుద్దుల కోసం చిన్నారి చెవి కోసిన కిలాడీ - Sakshi

దుద్దుల కోసం చిన్నారి చెవి కోసిన కిలాడీ

దుద్దుల కోసం చిన్నారి చెవిని కోసిందో కిలాడీ. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలివి...

 హైదరాబాద్: దుద్దుల కోసం చిన్నారి చెవిని కోసిందో కిలాడీ. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలివి... ఫిలింనగర్ జ్ఞానీజైల్‌సింగ్‌నగర్ బస్తీలో నివసించే బత్తిని శారద ఐదేళ్ల కుమార్తె మౌనిక ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే బస్తీకి చెందిన బేబీ అలియాస్ స్పందన ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లింది. తర్వాత బాలిక నోరు నొక్కేసి దుద్దులు లాక్కోవడానికి ప్రయత్నించింది. రాకపోవడంతో చెవి కోసి దుద్దులు తీసుకుని పరారైంది. చెవి నుంచి రక్తం కారుతున్న చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వివరాలు తెలుసుకున్నారు. పాప తల్లిదండ్రులకు సమాచారమందించారు. నిందితురాలు బేబీని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement