గొంతు కోసి చిన్నారి హత్య | child murdered in hlc canal | Sakshi
Sakshi News home page

గొంతు కోసి చిన్నారి హత్య

Nov 6 2016 12:06 AM | Updated on Sep 2 2018 3:57 PM

మండలంలోని హెచ్‌ఎల్‌సీ కాలువలో శనివారం గుర్తు తెలియని చిన్నారి(8) మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

బుక్కరాయసముద్రం : మండలంలోని హెచ్‌ఎల్‌సీ కాలువలో శనివారం గుర్తు తెలియని చిన్నారి(8) మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎస్‌ఐ విశ్వనాథ్‌ చౌదరి తెలిపిన వివరాల మేరకు.. చిన్నారిని ఎక్కడో గొంతుకోసి హత్య చేసి రగ్గులో పెట్టి తాడుతో బిగించి కాలువలో పడేశారు. తాడిపత్రి రహదారి పక్కన హెచ్‌ఎల్‌సీలో మృతదేహం తేలి వస్తుండడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. చిన్నారి మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశామని ఆయన తెలిపారు. సుమారు ఐదు రోజుల క్రితం హత్య చేసి కాలువలో పడేయడంతో మృత దేహం బాగా ఉబ్బి ఉందన్నారు. చిన్నారి ఒంటిపై ఎర్రటి గౌను ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement