అమెచ్యూర్‌ చెస్‌ పోటీలు ప్రారంభం | Chess competition begin | Sakshi
Sakshi News home page

అమెచ్యూర్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

Oct 19 2016 8:16 PM | Updated on Sep 4 2017 5:42 PM

అమెచ్యూర్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

అమెచ్యూర్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అమెచ్యూర్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.

గుంటూరు స్పోర్ట్స్‌: జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అమెచ్యూర్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ 2300 లోపు ఎలోరేటెడ్‌ క్రీడాకారులు 50 మంది టోర్నమెంట్‌లో పాల్గొన్నారని చెప్పారు. మొదటి, రెండవ స్థానం  సాధించిన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్‌లో క్రీడాకారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement