ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి | chandrababu Naidu obstacle to the special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి

Aug 4 2016 12:16 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి - Sakshi

ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకిగా మారుతోంది చంద్రబాబే నని డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ విమర్శించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకిగా మారుతోంది చంద్రబాబే నని డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ విమర్శించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రానికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండడంతో ఇదే సాకుగా చూసుకొని కేంద్ర పెద్దలు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలు, పోలవరం, రాజధాని నిర్మాణం, ఉక్కు పరిశ్రమ, దుగ్గరాజ పట్నం ఓడరేవు, విశాఖ రైల్వేజోన్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అందరు అడుగుతుంటే విచిత్రంగా ముఖ్యమంత్రే కేంద్రం ఏమిస్తారో ఇవ్వడంటూ అడగడం చూస్తే పలు అనుమానాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర బంద్‌ ప్రశాంతంగా జరుగుతుంటే పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాటకాలు మాని ప్రత్యేక హోదాపై నిజాయితీగా కేంద్రం పై పోరాడాలన్నారు. పీసీసీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌ఎ సత్తార్, పీసీసీ జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సేవాదళ్‌ ఛైర్మన్‌ చీకటి చార్లెస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement