బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట! | chandrababu mind block | Sakshi
Sakshi News home page

బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట!

Mar 6 2016 4:32 PM | Updated on Jul 28 2018 3:23 PM

బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట! - Sakshi

బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట!

కలర్ కలల చంద్రబాబుకు సింగపూర్ కంపెనీ సినిమా చూపించిందట.

కలర్ కలల చంద్రబాబుకు సింగపూర్ కంపెనీ సినిమా చూపించిందట. ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ఉచితంగా అందిస్తుందని చంద్రబాబు బీరాలు పలికారు. తనకు సింగపూర్‌తో ఉన్న అనుబంధంతోనే మాస్టర్ ప్లాన్ అందించేందుకు ముందుకొచ్చిందని చెవులు హోరెత్తేలా చెప్పారు. ‘‘చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవారు అదేదో.. అయినట్లు..’’ చివరకు సింగపూర్ చేతల్లో మాత్రం బాబుకు చుక్కలు చూపిస్తోందట.

సింగపూర్ కంపెనీ సుర్బానా అందించిన మాస్టర్ ప్లాన్‌ను మార్పులు, చేర్పులు అనంతరం ఇప్పుడు ఏకంగా సింగపూర్ సంస్థ రూ.20 కోట్లకు టెండర్ పెట్టిందట. మాస్టర్ ప్లాన్‌కు సింగపూర్ కంపెనీ పంపిన రూ.20 కోట్ల బిల్లును చూసి బాబు గారికి కళ్లు బైర్లు కమ్మాయట. బాబుకు ఆ విధంగా మైండ్ బ్లాక్ అయితే, సింగపూర్ దెబ్బకు మున్సిపల్ మంత్రి నారాయణ ‘అబ్బా..’ అంటున్నారట. ఏది ఏమైనా నారా వారి మాటలకు అర్ధాలే వేరులే...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement