సెంట్రల్‌ జైలును పరిశీలించిన అధికారులు | central jail visit | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలును పరిశీలించిన అధికారులు

Aug 29 2016 10:36 PM | Updated on Sep 4 2017 11:26 AM

తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలును సందర్శించారు. అకాడమీ ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఆఫ్‌కా) ఉన్నతాధికారి సౌమ్య నాయకత్వంలో ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురేసి సభ్యుల బృందం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును సందర్శించింది.

రాజమహేంద్రవరం క్రైం: 
తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలును సందర్శించారు. అకాడమీ ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఆఫ్‌కా) ఉన్నతాధికారి సౌమ్య నాయకత్వంలో  ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురేసి సభ్యుల బృందం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును సందర్శించింది. సెంట్రల్‌ జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌ను, ఓపెన్‌ ఎయిర్‌ జైలును పరిశీలించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఖైదీలకు ఇస్తున్న వృత్తి విద్యల శిక్షణను పరిశీలించారు. జైలుæ పనితీరు, ఖైదీలకు అనుసరిస్తున్న  సంస్కరణలు తదితర అంశాలను జైల్‌ సూపరిటెండెంట్‌ ఎం. వరప్రసాద్‌ వారికి తెలియజేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement