మహానందిలో సెల్‌పోన్ల నిషిద్ధం | cellphones prohibited in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో సెల్‌పోన్ల నిషిద్ధం

Sep 13 2015 8:17 PM | Updated on Sep 3 2017 9:20 AM

కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను సెల్‌ఫోన్లతో ఆలయంలోకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శంకర వరప్రసాద్ తెలిపారు.

మహానంది : కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను  సెల్‌ఫోన్లతో ఆలయంలోకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్లు, కెమెరాలను ఆలయంలోకి అనుమతించమని చెప్పారు.

అలాగే రుద్రగుండం, రెండు చిన్న కోనేరులలో పుణ్యస్నానాలాచరించే భక్తులు సాంప్రదాయ దుస్తులను దరిస్తేనే స్నానాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. బీడీలు, సిగిరెట్లు, గుట్కాలు ఆలయంలోకి అనుమతించకుండా, రాజగోపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పవిత్రతకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement